ETV Bharat / state
రేణుకను దిల్లీ పంపాలని కాంగ్రెస్, తెదేపా ర్యాలీ - RENUKA CHOWDARY
ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరిని గెలిపించాలని కాంగ్రెస్, తెదేపా కార్యకర్తలు కోరారు. హస్తం గుర్తుకే ఓటేసి భారీ ఆధిక్యంతో దిల్లీకి పంపాలని విజ్ఞప్తి చేశారు.
హస్తం గుర్తుకే ఓటేయాలి : కాంగ్రెస్ తెదేపా
By
Published : Apr 3, 2019, 2:04 PM IST
| Updated : Apr 3, 2019, 2:27 PM IST
రేణుకా చౌదరి విజయాన్ని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్, తెదేపా కార్యకర్తల ప్రచారం ఖమ్మం అభ్యర్థి రేణుకా చౌదరి విజయాన్ని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్, తెదేపా కార్యకర్తలు మధిరలో ప్రచారం నిర్వహించారు. తెదేపా మధిర నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాటిబండ్ల సత్యంబాబు ఆధ్వర్యంలో రెండు పార్టీల కార్యకర్తలు జెండాలు చేతబట్టి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు.మధిర పురపాలక పరిధిలోని ఉద్యోగుల కాలనీ, ముస్లిం కాలనీ, హనుమాన్ కాలనీ, ఆజాద్ రోడ్డు, ఎస్సీ కాలనీల్లో కాంగ్రెస్, తెదేపా శ్రేణులు విస్తృత ప్రచారం చేశారు. రేణుకతోనే ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఓటర్లకు వివరించారు. కరపత్రాలు పంచుతూ హస్తం గుర్తుకే ఓటేయాలని కోరారు. Last Updated : Apr 3, 2019, 2:27 PM IST