తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊరంతా ఏకమైంది.. గ్రామబడిని బతికించుకుంది...

అంకిత భావానికి సహకారం తోడైతే అసాధ్యం సుసాధ్యం చేయొచ్చనే దానికి ఈ పాఠశాలే ఉదాహరణ. మూతపడే దశ నుంచి అందరికీ ఆదర్శంగా నిలిచే స్థాయికి తీసుకెళ్లారు ఉపాధ్యాయులు, గ్రామస్థులు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం శంభునిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల కృషికి స్థానికులు తోడ్పాటుతో ఈ పాఠశాల ప్రగతిపథంలో సాగుతోంది.

By

Published : Jul 25, 2019, 9:47 PM IST

ఊరంతా ఏకమైంది.. గ్రామబడిని బతికించుకుంది...

ఊరంతా ఏకమైంది.. గ్రామబడిని బతికించుకుంది...

ఆ సర్కారు బడి పిల్లల్లేక మూసేసే దశకు చేరుకుంది. ప్రైవేటు పాఠశాలల దెబ్బకు కుదేలై తాళం వేసే పరిస్థితికొచ్చింది. ఈ సమయంలో వచ్చిన ప్రధానోపాధ్యాయుడు ఆ బడి దశనే మార్చేశాడు. ఒకప్పుడు పిల్లలు లేక వెలవెలబోయిన స్కూలు ప్రస్తుతం పచ్చదనంతో, సకల సౌకర్యాలతో.. విద్యార్థులతో కళకళలాడుతోంది. ఎన్నో పాఠశాలలకు ఆదర్శంగా నిలిచింది ఖమ్మం జిల్లా వేంసూరు మండలం శంభునిగూడెం పాఠశాల.

నమ్మకం కలిగించారు

గతేడాది ఈ పాఠశాలలో 35 మంది విద్యార్థులుండేవారు. పాఠశాలలో కనీస వసతుల్లేక తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు బడులకే పంపేవారు. ఈ సమయంలో బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, మరో ఉపాధ్యాయుడు స్కూలుని బతికించుకునే బాధ్యత ఎత్తుకున్నారు. గ్రామస్థులతో మమేకమై స్కూలు అభివృద్ధిపై చర్చించారు. సర్కారు బడిపై నమ్మకం కలిగించారు. ప్రభుత్వ బడి వల్ల లాభాలు వివరించారు. వారి మాటలను నమ్మిన ప్రజల సహకారంతో ఆ బడిని బతికించారు.

30 నుంచి 80కి పెరిగారు

ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 80కి చేరింది. గ్రామస్థుల సహకారంతో అనేక వసతులు వచ్చాయి. పాఠశాలలో మొక్కలు పెంచుతూ ఆహ్లదకరంగా తయారు చేశారు. కంప్యూటర్​లు బాగు చేయించి డిజిటల్​ పాఠాలను బోధిస్తున్నారు. దాతల సహకారంతో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తూ పాఠశాల అభివృద్ధిలో తామూ భాగస్వాములవుతున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది ఉపాధ్యాయులు అవసరం కాగా ఇద్దరే రెగ్యులర్​ ఉపాధ్యాయులున్నారు. వాలంటీర్లతో నెట్టుకొట్టుస్తున్నారు. పాఠశాల ప్రగతిని గుర్తించైనా అధికారులు తగినంతమంది ఉపాధ్యాయులను నియమించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఈ సర్కారు బడికి నో-అడ్మిషన్ బోర్డు పెట్టేశారు

ABOUT THE AUTHOR

...view details