Tummala Nageshwar Rao Met Supporters in Khammam: గత వారంబీఆర్ఎస్ 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ జాబితాలో ఖమ్మం జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు(Tummala Nageshwar Rao) పేరు లేకపోవడంతో ఆరోజు నుంచి ఆయన అసమ్మతి గళం వినిపిస్తూనే ఉన్నారు. తుమ్మలను శాంతింపజేయడానికి ఎంపీ నామా నాగేశ్వర్రావును పంపించారు. అయినా ఆయన అలక విడవలేదు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన భారీ ర్యాలీలోనూ బీఆర్ఎస్(BRS) జెండాలు ఎక్కడా కనిపించలేదు.
ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటూ.. కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ క్రమంలో నేడు ఖమ్మం జిల్లా గండుగులపల్లిలో తుమ్మల నాగేశ్వర్రావును కూసుమంచి మండలం నేతలు కలిశారు. ఈ క్రమంలో వారితో సుదీర్ఘంగా మాజీ మంత్రి తుమ్మల చర్చించారు. నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉండాలని అనుచరులకు ఆయన సూచించారు. మీ కోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ.. స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీటీసీ, సర్పంచ్లు తుమ్మల నాగేశ్వర్రావును ఆయన నివాసంలో కలిశారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
రాజకీయ శత్రువులను నమ్మొచ్చు కానీ ద్రోహులను నమ్మకూడదు: తుమ్మల
Tummala Nageshwar Rao Election Plan :బీఆర్ఎస్ టికెట్ లభించకపోవడంతో తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర అసహనానికి గురైయ్యారు. అందుకు తాను ఎవరినీ నిందించ తలచుకోలేదని తెలిపారు. తన రాజకీయ జీవితం ప్రజల చేతుల్లోని ఉందని వివరించారు. తన జిల్లా అభివృద్ధి కోసం జీవితాన్నే అంకితం చేశానన్నారు. నియోజకవర్గంలో ఎందరో నాయకుల వల్ల కానివి.. తాను చేసి చూపించినట్లు తుమ్మల నాగేశ్వర్రావు వివరించారు. ఈ ఎన్నికల్లో తనను తప్పించడానికి ఎందరో.. ఎన్నో ఎత్తుగడలు వేశారని ఆరోపించారు. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నిన తనను ఖమ్మం ప్రజలతో ఉన్న అనుబంధం నుంచి విడదీయలేరని స్పష్టం చేశారు.