ఆర్టీసీ సమ్మె విరమణ ప్రకటనతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధుల్లోకి చేరేందుకు వెళ్లిన కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని 6 డిపోల పరిధిలో పనిచేస్తున్న కార్మికుల్లో చాలామంది కార్మికులు విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు వెళ్లారు. మీకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధుల్లోకి చేరేందుకు వస్తున్న చాలా మంది కార్మికులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది.
ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం డిపోల వద్ద పోలీసులు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఇక ఖమ్మంలో దాదాపు 5 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్టీసీ కార్మికులు, రాజకీయ పార్టీల నాయకులు గుమికూడగా... వారు బయటకు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులు కార్యాలయం భవనం ఎక్కిన నిరనస తెలిపారు. అనంతరం బస్టాండు వైపు పరుగులు పెట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడం వల్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇవీ చూడండి: ఈనెల 28న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ఆర్టీసీపై చర్చ!!