ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా కొనసాగుతోంది. మొత్తం 2800 మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలోని ఆరు డిపోల్లో కలిపి 632 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల పరిధిలో బస్సులు డిపోలకే పరిమితమయ్యా యి. మొత్తం 420 బస్సులకు గాను 70 బస్సులను నడుపుతున్నారు. బస్సుడిపోలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు. సమ్మె ప్రభావంతో దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఖమ్మంలో ఆగిన ప్రగతి రథచక్రాలు - tsrtc bus strike today
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. సమ్మె నేపథ్యంలో అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
ఖమ్మంలో ఆగిన ప్రగతి రథచక్రాలు