తెలంగాణ

telangana

ETV Bharat / state

'నామ గెలుపునకు తెరాస శ్రేణులు కృషి చేయాలి' - NAMA NAGESHWAR RAO

రాజకీయ విభేదాలను పక్కన పెట్టి,  పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయానికి తెరాస శ్రేణులంతా  కృషిచేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. నియోజకవర్గ స్థాయి సమావేశంలో కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు.

వైరాలో ఒకే వేదికపై సమావేశం నిర్వహణతో అందరిలో ఆసక్తి

By

Published : Mar 24, 2019, 10:15 PM IST

ఖమ్మంలో నామ నాగేశ్వర రావును గెలిపించుకోవాలి : తుమ్మల
అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఎదురైన చేదు ఫలితాల నేపథ్యంలో నేతలంతా ఒకే తాటిపైకి వచ్చారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పార్టీ అధినేత ఆకాంక్షలకు అనుగుణంగా ఖమ్మం పార్లమెంట్​ నియోజకవర్గంలో నామ నాగేశ్వర ​రావు విజయానికి కృషి చేయాలని కోరారు.పోలింగ్ బూత్​ను లక్ష్యంగా చేసుకుని, తనను గెలిపించాలని అభ్యర్థి నామ నాగేశ్వర​రావు కోరారు. ఇతర పార్టీల నుంచి తెరాసలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. తెరాస వర్గపోరుకు ప్రధాన కేంద్రమైన వైరాలో ఒకే వేదికపై సమావేశం నిర్వహించటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details