జాతీయ రాజకీయాలు అస్పష్టంగా ఉన్నాయని తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు తరఫున రోడ్‌షోలో పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీల సమూహమే దేశానికి దిక్సూచి కాబోతుందని స్పష్టం చేశారు. 16 ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని పేర్కొన్నారు. నామ నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
'ప్రాంతీయ పార్టీల సమూహమే దేశానికి దిక్సూచి' - తెరాస ఎన్నికల ప్రచారం
ఎన్నికలకు ఒక రోజే గడువుండటం వల్ల రోడ్‌షోలతో తెరాస ప్రచార జోరు పెంచింది. ఖమ్మం జిల్లా కల్లూరులో పార్లమెంటు తెరాస అభ్యర్థి నామ నాగేశ్వరరావు తరఫున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్‌షోలో పాల్గొన్నారు.
తెరాస రోడ్‌షో