రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస ఏకపక్ష విజయం సాధించడం ఖాయమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. నగరంలో తెరాస చేసిన అభివృద్ధి కార్యక్రమాలే అన్ని డివిజన్లలో తెరాస అభ్యర్థుల విజయానికి నాంది పలుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని 8వ డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
'ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాసది ఏకపక్ష విజయం' - khammam latest news
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాసదే గెలుపని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలే విజయానికి నాంది పలుకుతాయని వివరించారు.
రవాణాశాఖ మంత్రి, పువ్వాడ అజయ్ కుమార్
పలు కాలనీల్లో పర్యటించిన మంత్రి పువ్వాడకు తెరాస కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గత ఐదేళ్లలో డివిజన్ల అభివృద్ధి కోసం చిత్తశుద్ధిగా పనిచేసిన వారందరికీ మళ్లీ అవకాశం కల్పిస్తామన్న ఆయన.. ఎన్నికల్లో ప్రత్యేకంగా సర్వే నిర్వహించి అభ్యర్థులను ఖరారు చేస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి:తెదేపా నేతలపై.. అక్రమ కేసులు ఎత్తివేయాలి: చంద్రబాబు