కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగ, కార్మిక సంఘాల నిరసన - trade unions protest
ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ... ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తూ కార్పొరేట్ శక్తులకు లొంగిపోయిందని నాయకులు ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఖమ్మంలో ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలో ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇఫ్టూ తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తూ కార్పొరేట్ శక్తులకు లొంగి పోయిందని నాయకులు ఆరోపించారు. ఇప్పటికైనా కార్మిక విధానాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని... లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.