తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో విద్యార్థి సంఘాల ర్యాలీ - TSNF

తెరాస ప్రభుత్వం విద్యారంగ సమస్యలు తీర్చకుండా..ప్రజలకు ఉపయోగపడని పనులు చేస్తోందటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : Jul 10, 2019, 1:27 PM IST

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా... సచివాలయ భవనాలు కూల్చి కొత్తవి నిర్మించుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ర్యాలీలో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్​యూ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.

ఖమ్మంలో విద్యార్థి సంఘాల ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details