Thummala Nageswara Rao Meets Rahul Gandhi in Delhi: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తరువాత తుమ్మల.. పార్టీ అగ్రనేతలతో భేటీ కావడం ఇదే తొలిసారి. నిన్న కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తుమ్మలకు పిలుపువచ్చింది. దీంతో ఆయన ఇవాళ దిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) సూచన మేరకు దిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.
Thummala and Rahul Gandhi Discuss Telangana Politics : పార్టీలో చేరిన తరువాత తొలిసారిగా రాహుల్‌తో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు ఇరువురు రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు చర్చించారు. ప్రదానంగా ఖమ్మం జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, రాజకీయ వ్యూహాలపై కూడా చర్చించారని తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం తుమ్మల.. కేసీ వేణుగోపాల్‌ని కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి, అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు నేతలు చర్చించారు.
Thummala Nageswara Rao Join Congress :సెప్టెంబర్ 16న తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్(Congress) తీర్థం పుచ్చుకున్నారు. అతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం పార్టీ కండువ కప్పుకున్నారు. దీంతో ఖమ్మం జిల్లాలోని రాజకీయ సంకేతాలు మారాయి. ఖమ్మం జిల్లాలో ఆయన కాంగ్రెస్‌లో చేరడం కలిసి వస్తోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈచేరిక ప్రభావంతో కాంగ్రెస్ వచ్చే సీట్లు సంఖ్య పెరిగే అవకాశం ఉందని పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తుమ్మల(Thummala) చేరిక రోజు రాహుల్ గాంధీ బీజీ షెడ్యూల్ వల్ల దిల్లీ వెళ్లి తిరిగి వెనక్కి వచ్చేశారు. అనంతరం ఈరోజు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది.