ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం కొమరం భీం విగ్రహాన్ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆవిష్కరించారు. 1976లో ఎటువంటి ఆధారాలు లేకుండా లంబాడీలను ఎస్టీ జాబితాలో కలపడం వల్ల ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎంపీ బాపూరావు అన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.
భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ సోయం - ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం కొమరం భీం విగ్రహాన్ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు
సత్తుపల్లిలో శనివారం కొమరం భీం విగ్రహాన్ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆవిష్కరించారు. భీమ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు.
భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ సోయం
కొమురం భీం పోరాట ఫలితంగానే ఆదివాసీలు అనేక హక్కులు, జీవోలు పొందారని పేర్కొన్నారు. తాను ఉద్యమం చేపట్టింది ఆదివాసీల భవిష్యత్ తరాల కోసమన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం రాష్ట్ర మంత్రులకు ఇచ్చే వినతుల వివరాలను వెల్లడించారు.
ఇదీ చూడండి : స్వామివారి ఉత్సవాల్లో శునకాల పోటీలు