ఖమ్మం జిల్లా హరిశ్చంద్రపురంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం నాసిరకంగా ఉందని జాటోత్ రాంబాబు, బొడా నరేశ్‌లు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ఈ విషయంపై హౌసింగ్ ఏఈ మూసఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'ప్రశ్నిస్తే.. అక్రమంగా కేసులు పెడతారా' - tribal youth arrested for social media posts
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం సక్రమంగా చేపట్టాలని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టిన ఇద్దరు గిరిజన యువకులపై అక్రమంగా కేసులు పెట్టారని రాష్ట్ర గిరిజన సంఘం మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది.
'ప్రశ్నిస్తే.. అక్రమంగా కేసులు పెడతారా'
వాస్తవాలు తెలుసుకోకుండా పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారని సీపీఎం అనుబంధ సంస్థ సంఘం నాయకులు ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల అవినీతి ప్రజలకు తెలియజేయడాన్ని నేరంగా ఎలా పరిగణిస్తారని నిలదీశారు. పౌరుల ప్రాథమిక హక్కులకు పోలీసులు భంగం కలిగిస్తున్నారని మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
యువకులపై పెట్టిన కేసులను ఉపసంహరించి.. వాస్తవాలు తెలుసుకోకుండా ఫిర్యాదు చేసిన హౌసింగ్ ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి:ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య!
TAGGED:
తెలంగాణ గిరిజన సంఘం