తెలంగాణ

telangana

ETV Bharat / state

'సింగరేణిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా'

సీతారామ ప్రాజెక్టు కంటే ముందుగానే సింగరేణి మండలంలో బుగ్గవాగు ఆనకట్ట నిర్మాణం చేపట్టి చెరువులు నింపుతామని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. సింగరేణి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

telangana state transport minister puvvada ajay kumar says that he will try to develop singareni mandal in khammam district
మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్ ఖమ్మం పర్యటన

By

Published : Dec 23, 2019, 10:55 AM IST

ఖమ్మం జిల్లాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​, ఎంపీ నామ నాగేశ్వరరావు పర్యటించారు. విశ్వనాథపల్లిలో రెండు పడక గదుల ఇళ్లు ప్రారంభించారు.

సింగరేణి మండలానికి సింగరేణి, డోలమైట్​ సంస్థల నుంచి అభివృద్ధి నిధులు మంజూరు చేయాల్సిందిగా స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. మండలవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సింగరేణితో చర్చించి నిధులు వచ్చే విధంగా కృషి చేస్తానని పువ్వాడ హామీ ఇచ్చారు.

తమది ఏజెన్సీ ప్రాంతమి, అక్కడి గిరిజన గ్రామాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఎంపీపీ శకుంతల మంత్రి పువ్వాడకు విన్నవించారు. విద్యుత్​ ఉపకేంద్రం ఏర్పాటుకు స్థలం ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.

సీతారామ ప్రాజెక్టు కంటే ముందుగానే సింగరేణి మండలంలో బుగ్గవాగు ఆనకట్ట నిర్మాణం చేపట్టి చెరువులు నింపుతామని మంత్రి హామీ ఇచ్చారు.

మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్ ఖమ్మం పర్యటన

ABOUT THE AUTHOR

...view details