ఏనుకూరు ఎంపీపీ తెదేపా వశం - mpp
ఖమ్మం జిల్లాలో తెదేపా తన ఉనికిని చాటుకుంది. ఏనుకూరు మండల పరిషత్ అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.
తెలంగాణలో తెదేపా పని అయిపోయిందనుకున్నా వారికి సమాధానంగా తెలుగు దేశం పార్టీ ఖమ్మం జిల్లా ఏనుకూరు ఎంపీపీ పదవి దక్కించుకుంది. తెలుగుదేశం అభ్యర్థి ఆరం వరలక్ష్మిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పాశం శ్రీనివాస రావు ఎన్నికయ్యారు. ఈ విజయంతో తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మండల పరిషత్ కార్యాలయం నుంచి ప్రధాన కూడలి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. విజయోత్సవ సంబురాలు చేశారు. నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద పూలమాలవేసి నివాళులు అర్పించారు.