ఖమ్మంలో కరోనా నిర్ధరణ పరీక్షల కోసం నగరవాసులు బారులు తీరుతున్నారు. పాత బస్టాండ్ సమీపంలో రెండు మొబైల్ వాహనాల ద్వారా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు అనుమానితులు భారీగా తరలివచ్చారు. కిట్లు ఉన్నంతవరకు టోకెన్లు ఇచ్చి వైద్య సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు.
కరోనా పరీక్షల కోసం తరలివస్తున్న అనుమానితులు
కరోనా రెండో దశ ప్రభావంతో జనం అప్రమత్తమయ్యారు. ఏమాత్రం లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఖమ్మం నగరంలోని పరీక్షా కేంద్రాలకు జనం పోటెత్తారు. అనుమానం ఉంటే కుటుంబంతో సహా తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.
కరోనా పరీక్షా కేంద్రాల్లో జనం బారులు, ఖమ్మంలో కొవిడ్ పరీక్షా కేంద్రాలు
ఏమాత్రం అనుమానం ఉన్నా కుటుంబ సభ్యులంతా పరీక్షల కోసం తరలివస్తున్నారు. పాజిటివ్‌గా తేలిన వారికి వెంటనే మందుల కిట్ అందజేస్తున్నారు.
ఇదీ చదవండి:ఆస్పత్రుల్లో రోగుల అవస్థలు.. బయట కుటుంబసభ్యుల అష్టకష్టాలు