ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని ఓ గ్రామంలో బాలికపై 63 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. బాలికకు మద్దతుగా పాఠశాల విద్యార్థులు, గ్రామస్థులు నిందితులను కఠినంగా శిక్షించాలని ర్యాలీ చేశారు.
అత్యాచార నిందితున్ని శిక్షించాలంటూ విద్యార్థుల ర్యాలీ - ఖమ్మం జిల్లా నేటి వార్తలు
ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో 63 ఏళ్ల వృద్ధుడు బాలికపై బుధవారం అత్యాచారయత్నం చేసిన ఘటనపై నిందితున్ని కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు, గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
అత్యాచార నిందితున్ని శిక్షించాలంటూ విద్యార్థుల ర్యాలీ
ఈ ఘటనపై వారి బంధువులు, గ్రామస్థులు నిన్న రాత్రి అతనికి దేహశుద్ధి చేసి ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి : గొంతులో బియ్యం పోసి.. నోట్లో వస్త్రాలు కుక్కి హత్యాచారం