కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ ప్రబలకుండా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. అక్కడి ప్రజలు బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఆ ప్రాంతాల్లో మరింత పటిష్ఠ చర్యలు - వైరస్ నివారణ చర్యలు
ఖమ్మంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికారులు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ ప్రబలకుండా... అక్కడి ప్రజలు బయటకు రాకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు.
ఆ ప్రాంతాల్లో మరింత పటిష్ఠ చర్యలు
నగర పాలక సంస్థ సిబ్బంది, ఫైర్ సిబ్బంది వీధులన్నీ రసాయనాలతో పిచికారి చేస్తున్నారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వారి వివరాలు తీసుకుని ఉష్ణోగ్రతలు నమోదు చేస్తున్నారు. నిత్యావసరాలు అందించేందుకు ఆర్టీసీ బస్సును వీధుల్లో తిప్పుతున్నారు. ఇంటింటికి కూరగాయలు అందిస్తున్నారు.
ఇవీ చూడండి:కరోనా కయ్యం: చైనాపై అమెరికా ముప్పేట దాడి