లాక్డౌన్లో భాగంగా ఖమ్మం నగరపాలికలో దుకాణాల నిర్వహణ సమయంలో స్వల్ప మార్పులు చేసినట్టు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలు నిర్వహించుకునేందుకు అనుమతించినట్టు వెల్లడించారు.
లాక్‌డౌన్ సడలింపు... దుకాణాల నిర్వహణలో మార్పులు - CORONA EFFECTS
ఖమ్మంలో లాక్‌డౌన్ నిబంధనల్లో స్వల్పంగా సడలింపులు చేసినట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు దుకాణాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఇక మిగతా నిబంధనలన్నీ యథావిధిగా పాటించాలని పేర్కొన్నారు.
లాక్‌డౌన్ సడలింపు... దుకాణాల నిర్వహణలో మార్పులు
అత్యవసరమైతే తప్ప... ప్రజలు బయటకు రావద్దని... వస్తే తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. ద్విచక్రవాహనంపై ఒక్కరు, కారులో ఇద్దరికి మించి ప్రయాణిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కంటైన్‌మెంట్ జోన్‌లలో లాక్‌డౌన్ నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని అధికారులు ఈ మార్పులను పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.