ఖమ్మం జిల్లా మధిరలోని పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం ఆలయంలో రాములవారి కల్యాణం జరిగే ముహూర్తానికి ఇక్కడి ఆలయంలో కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
మధిరలో ఘనంగా సీతారాముల కల్యాణం - తెలంగాణ వార్తలు
శ్రీరామ నవమిని పురస్కరించుకొని మధిర శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శాస్త్రోక్తంగా జరిపారు. భద్రాద్రిలో జరిగే ముహుర్తానికి ఇక్కడ కల్యాణం జరపడం ఆనవాయితీ.
సీతారాముల కల్యాణం, శ్రీరామనవమి 2021
కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు, జనార్దన్, ఆచార్యులు శేషాచార్యులు, వేద మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా సీతారామ కల్యాణాన్ని జరిపారు. ఆలయ ఛైర్మన్ మురళి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:రెండు శరీరాలు, ఒకటే ఆత్మ.. వారే సీతారాములు!