తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆశ్రమ పాఠశాలకు వసతులేవీ?'

ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలను కొణిజర్ల మండలంలోని గిరిజన బాలల ఆశ్రమ పాఠశాల నూతన భవనానికి బదలాయించడంపై గిరిజన సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. మౌలిక వసతులు కల్పించకుండా విద్యార్థులను తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

school-issue-in-khammam
'ఆశ్రమ పాఠశాలకు వసతులేవీ?'

By

Published : Dec 29, 2019, 11:04 AM IST

వసతులు కల్పించకుండా ఆశ్రమ పాఠశాలను బదలాయించడంపై ఖమ్మం జిల్లాలోని గిరిజన సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. కొణిజర్ల మండలం బస్వాపురం వద్ద గిరిజన బాలల కోసం పోస్టుమెట్రిక్‌ ఆశ్రమ పాఠశాలను నిర్మించారు. ఆ భవనంలో సౌకర్యాలు సమకూర్చకుండానే ఖమ్మంలో ఉన్న విద్యార్థులను తీసుకురావడం వల్ల వారు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.

దీనిపై గిరిజన సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. పొలాల మధ్య ఉన్న ఆశ్రమంలో ప్రహరీ లేకుండా పిల్లలకు ఎలా రక్షణ కల్పిస్తారని నిర్వాహకులను ప్రశ్నించారు. గిరిజన విద్యార్థులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.

సంక్రాతి సెలవుల్లో వసతులు కల్పించి ఆ తర్వాత పిల్లలను ఇక్కడకు పంపించాలని డిమాండ్‌ చేశారు. అధికారులు వెంటనే ఇక్కడి వసతుల నిర్మాణానికై దృష్టిసారించాలని కోరారు.

'ఆశ్రమ పాఠశాలకు వసతులేవీ?'

ఇవీ చూడండి: 'చట్టసభల కమిటీలు క్రియాశీలకంగా పని చేయాలి'

ABOUT THE AUTHOR

...view details