తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఖమ్మం గ్రామీణ నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ' - DOUBLE BED ROOM

అర్హులైన పేదలకు రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఖమ్మం జిల్లా కేంద్రంలో గ్రామీణ నిరుపేదల సంఘం నేతలు  డిమాండ్‌ చేశారు. నగర శివారు వెలుగుమట్ల వినోబా కాలనీలో నివాసముంటున్న వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

పేదలు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి :

By

Published : Jun 17, 2019, 8:27 PM IST

ఖమ్మం నగరంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పట్టణ నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పెవిలియన్‌ మైదానం నుంచి ధర్నా చౌక్‌ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా చౌక్‌లో ధర్నా చేశారు.
కరెంట్‌, మంచినీరు, రెండు పడకల గదులు తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పేదలు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చి, ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.

అర్హులైన పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలి : నిరుపేదల సంఘం

ABOUT THE AUTHOR

...view details