తెలంగాణ

telangana

ETV Bharat / state

రైల్లో చోరీ - illamdu

రైల్లో మహిళల బోగీలో  దొంగ హల్​చల్​ చేశాడు. ఓ మహిళపై కత్తితో దాడిచేసి బంగారం, నగదు దోచుకెళ్ళాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని బాధితురాలు వాపోయింది.

రైలులో చోరీ

By

Published : Mar 5, 2019, 3:51 AM IST

Updated : Mar 5, 2019, 7:25 AM IST

మహిళల బోగీలో ప్రవేశించిన ఓ దొంగ హల్​చల్​ చేశాడు. ఓ మహిళపై దాడిచేసి బంగారం, నగదు దోచుకెళ్లాడు. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన సుజాత చెన్నై నుంచి ఖమ్మం వచ్చేందుకు నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్​లో బయలుదేరింది. ఆ మహిళల బోగీలో తెనాలి వద్ద ఓవ్యక్తి ఎక్కాడు. మూత్రశాల వద్ద మాటు వేశాడు. తెనాలి స్టేషన్​ దాటిన తర్వాత మూత్రశాలకు వెళ్లిన సుజాతను కత్తితో బెదిరించాడు. మెడలోని గొలుసు, ఉంగరం, రూ. వెయ్యి నగదు దోచుకున్నాడు. బోగీలోని చైన్​లాగి రైలు ఆపేందుకు యత్నించిన ఆమెపై కత్తితో దాడి చేసి రైల్లోంచి దూకి పారిపోయాడు.

రైలులో చోరీ
Last Updated : Mar 5, 2019, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details