తెలంగాణ

telangana

ETV Bharat / state

'14 సీట్లున్నా బొంగరం కూడా తిప్పలేదేందుకు?' - parliament

ఎండ... వానా అనేది పట్టించుకోకుండా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్​ అభ్యర్థి రేణుకా చౌదరి వైరా నియోజకవర్గంలో తనను గెలిపించి జిల్లా అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి కేసీఆర్​ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

వైరా నియోజకవర్గంలో రేణుక ప్రచారం

By

Published : Apr 2, 2019, 11:47 PM IST

వైరా నియోజకవర్గంలో రేణుక ప్రచారం
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి ఇవాళ వైరా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. కొణిజర్ల, వైరా, ఏనుకూరు, కారేపల్లి, జూలూరుపాడు మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని కేసీఆర్​పై విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లాలో కష్టపడే ప్రజా నాయకుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఎంపీ స్థానాన్ని కేటాయించకుండా జిల్లాకు నామాలు పెడతానన్న నామా నాగేశ్వరరావుకు అవకాశం కల్పించారని ఎద్దేవా చేశారు. ఉపాధి కల్పించే విధంగా దేశవ్యాప్తంగా పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్​దేనని రేణుక పేర్కొన్నారు. 16 సీట్లు గెలిపిస్తే చక్రం తిప్పుతానన్న కేసీఆర్​.. 14 ఎంపీలు తమ వద్ద ఉన్నా కూడా బొంగరం కూడా తిప్పలేదేమిటని ప్రశ్నించారు బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్​ ఐదేళ్లపాటు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆమె ఆరోపించారు.ఐదు మండలాల్లో రేణుకా చౌదరి పర్యటనలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details