ప్రజాస్వామ్యమే తమ నినాదమని... ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రేణుకా చౌదరి ఉద్ఘాటించారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేని తెరాస ప్రభుత్వం... ఎమ్మెల్యేల కొనుగోలుకు మాత్రం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని ఎద్దేవా చేశారు. మోదీ-రాహుల్ మధ్య జరుగుతున్న ఈ పోరులో... కేసీఆర్ కు ఏం సంబంధం ఉందని ఆమె ప్రశ్నించారు. పాలేరు నుంచి పర్ణశాల వరకు అభివృద్ధి చేసిన ఘనత తనదేనన్న రేణుకాచౌదరి.. ప్రజలు మళ్లీ అవకాశం ఇస్తే ఖమ్మంను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు.
జిల్లానే నా కుటుంబం... కార్యకర్తలే నా వారసులు... - COWDHARY
పదేళ్ల క్రితం తాను చేసిన అభివృద్ధి ముందు తెరాస నేతలు చేసిన పనులేవి కనిపించట్లేదని ఖమ్మం ఎంపీ రేణుకాచౌదరి పేర్కొన్నారు. ఖమ్మంలో రైల్వే బ్రిడ్జ్‌లు కట్టించినా... పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటకంగా మార్చినా... అన్ని ఘనతలు తనకే దక్కుతాయంటున్నారు రేణుక. ముచ్చటగా మూడోసారి బరిలో దిగుతున్న తనకు జిల్లానే కుటుంబమని... కార్యకర్తలే తన వారసులంటున్నారు.
ముచ్చటగా మూడోసారి బరిలో...