తెలంగాణ

telangana

ETV Bharat / state

"పేదలకు ఇళ్లు ఇవ్వడంలో తెరాస విఫలమైంది" - రేణుకా చౌదరి

నిరుపేదలకు రెండు పడక గదులు ఇవ్వడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే పేదవాళ్లకు ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రేణుక చౌదరి

By

Published : Mar 31, 2019, 1:21 PM IST

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కాంగ్రెస్​ అభ్యర్థి రేణుకా చౌదరి రోడ్​ షో
కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే.. పేదవానికి లబ్ధి చేకూరుతుందని ఖమ్మం పార్లమెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఉచిత గ్యాస్ పంపిణీ, 2 లక్షల రుణమాఫీ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details