ETV Bharat / state
మోదీని ఉద్యోగం నుంచి తొలగించండి: ఏచూరి - KHAMMAM PARLIAMENT
దేశానికి కాపలాదారుడైన ప్రధానమంత్రి బాధ్యత నిర్వహణలో విఫలమయ్యారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను నీరుగార్చుతున్న మోదీని గద్దె దించాలని ప్రజలను కోరారు.
కాపలాదారుగా ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారు :ఏచూరి
By
Published : Mar 22, 2019, 11:45 PM IST
| Updated : Mar 23, 2019, 7:48 AM IST
కాపలాదారుగా ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారు :ఏచూరి కాపలాదారుగా ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రజలకు, మతసామరస్యానికి, దేశ భవిష్యత్‌కు, ఆర్థిక వ్యవస్థకు కాపలా కాయడం ప్రధాని కర్తవ్యమన్నారు. ఇటువంటి నిర్లక్ష్య ప్రధానిని ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం పార్లమెంటు స్థానానికి సీపీఎం అభ్యర్థిగా వెంకట్ నామ పత్రాలు దాఖలు చేశారు. వెంకట్‌ను భారీ ఆధిక్యంతో పార్లమెంట్‌కు పంపించాలని కోరారు. Last Updated : Mar 23, 2019, 7:48 AM IST