పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం చెప్పినా... అనేక కొర్రీలు పెట్టి రిజిస్ట్రేషన్లు చేయటం లేదని ఖమ్మంలో స్థిరాస్తి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. లే అవుట్ లేకుండా ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేయటం లేదన్నారు. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వేలాది ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని వాపోయారు. రూ.లక్షల్లో అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.
'పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ అని... కొర్రీలు పెడుతున్నారు' - తెలంగాణ వార్తలు
పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం చెప్పినా... అనేక నిబంధనలు పెట్టి రిజిస్ట్రేషన్లు చేయడం లేదని స్థిరాస్తి వ్యాపారులు వాపోయారు. ఖమ్మం రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ధర్నాకి దిగారు. అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.
'పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ అని... కొర్రీలు పెడుతున్నారు'
జీవో నం.131ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో ఉద్ధృతంగా పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.