దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. పీవీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణలో జన్మించి అనేక భాషలు నేర్చి అన్ని రంగాల్లో తన ప్రతిభను కనబరిచిన గొప్ప వ్యక్తిగా పీవీ చరిత్రలో నిలిచారన్నారు.
తెలంగాణ ముద్దుబిడ్డ పీవీకి స్వరాష్ట్రంలో సరైన గౌరవం: పువ్వాడ
దేశ ఆర్థిక సంస్కరణలకు బీజం వేసి ఆర్థిక రంగాన్ని ఒక మలుపు తిప్పిన బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పీవీ శత జయంతి దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఖమ్మంలో ఘనంగా పీవీ శత జయంతి వేడుకలు
ఆయనకు అప్పటి ప్రభుత్వాలు సరైన గుర్తింపు ఇవ్వలేదన్నారు. ఏడాదంతా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. లకారం ట్యాంక్ బండ్పై రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ ఇక్బాల్, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: తెలుగువారి ఠీవీ- మన పీవీ: 'ఈటీవీ భారత్' అక్షర నివాళి