గ్రామాలను అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి పట్టణంలో పర్యటించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
30 రోజుల ప్రణాళికలో మంత్రి పువ్వాడ - puvvada
30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం జిల్లా తల్లాడలో పర్యటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు.. ఎంపీ, ఎమ్మెల్యేల నిధులతో గ్రామాభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించి సర్పంచులకు నిధులు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి పేర్కొన్నారు. దశలవారీగా కేంద్రం ఇచ్చే నిధులతో పాటు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక ప్రణాళికలో ఉత్సాహంగా పాల్గొనాలని ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి రూ.1630 కోట్లు మంజూరయ్యాయని.. వీటితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రుల నిధులతో మరింత అభివృద్ధి చేపడతామన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండిః వినోద్ ట్వీట్‌కు... కేటీఆర్ ఏం చేశారంటే!