ఖమ్మం నగరంలో మిషన్ భగీరథ పనులు పూర్తి కావటానికి మంత్రి కేటీఆర్ రూ. 67 కోట్లు మంజూరు చేశారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో చేపట్టిన మిషన్ భగీరథ పనులు దాదాపుగా పూర్తి కావటానికి వచ్చాయన్నారు. కొవిడ్ సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టాల్లో ఉన్నా.. మంత్రి రూ. 67 కోట్ల నిధులు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. నగరంలో మొత్తం 75 వేల కుటుంబాలకు భగీరథ ద్వారా తాగునీటి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ప్రతి రోజు నీటిని అందించటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
'ప్రతి ఇంటికి ప్రతి రోజు నీటిని అందించటమే లక్ష్యం' - Minister puvvada on mission bhagiratha
ఖమ్మం నగరంలో మిషన్ భగీరథ పనులు పూర్తి కావటానికి మంత్రి కేటీఆర్ రూ. 67 కోట్లు మంజూరు చేశారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
'ప్రతి ఇంటికి ప్రతి రోజు నీటిని అందించటమే లక్ష్యం'