తెలంగాణ

telangana

ETV Bharat / state

గర్భిణి మృతి.. వైద్యులపై బంధువుల ఆగ్రహం..

ఖమ్మం జిల్లా డోర్నకల్​లో ప్రైవేటు ఆసుపత్రిలో నిండు గర్భిణి మృతిపై ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులు మాత్రం తమ ప్రయత్నం తాము చేశామని చెప్పుకొచ్చారు.

By

Published : Feb 12, 2019, 7:56 PM IST

ఆస్పత్తి ఎదుట మృతురాలి బంధువుల ఆందోళన

ఆస్పత్తి ఎదుట మృతురాలి బంధువుల ఆందోళన
అస్వస్థతగా ఉందని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తే .. ప్రాణం పోయిన ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. జిల్లాలోని డోర్నకల్​ మండలం బుద్యా తండాకు చెందిన గుగులోతు ఉమ గర్భిణి. మూడు రోజుల క్రితం డా.పాపాలాల్​ ఆస్పత్రిలో చేరింది. అప్పటి నుంచి సరైన వైద్యం అందించలేదని.. బంధువులు వాపోయారు. పరిస్థితి విషమించిన తరువాత వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడకు వెళ్లే సరికే కడుపులో బిడ్డ, తరువాత చికిత్స పొందుతూ తల్లి మృతిచెందింది.
వైద్యుల నిర్లక్ష్యమే నిండు గర్భిణి ప్రాణాన్ని బలిగొందని మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారినందున ఖమ్మం ఏసీపీ వెంకట్రావు అక్కడకు చేరుకొని బాధితులతో మాట్లాడారు.

ABOUT THE AUTHOR

...view details