ఖమ్మం జిల్లా ఏన్కూరులో బుచ్యాల కృష్ణ మండలంలో తాత్కాలికంగా విద్యుత్ మీటర్ రీడింగ్ తీసే పని చేస్తున్నాడు. ఇంట్లో భార్యాపిల్లలతో నేలపై పడుకుని ఉండగా అర్ధరాత్రి పాము కాటేసింది. కొద్దిసేపటి అపస్మారక స్థితికి చేరుకున్న కృష్ణను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతిచెందాడు. ఏనుకూరులో ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యకర్తగా గుర్తింపు పొందిన కృష్ణ మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి.
పాముకాటుతో విద్యుత్ ఒప్పంద కార్మికుడు మృతి - Power contract worker dies with snake bite
తాత్కాలిక విద్యుత్ కార్మికుడు పాముకాటుకు గురై మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా ఏన్కూరులో జరిగింది.
పాముకాటుతో కార్మికుడు మృతి
TAGGED:
kammam