మూఢనమ్మకాలపై పోలీసు కళాజాతర - పోలీసు కళాజాతర
మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు, సైబర్ నేరాలు, ఆడపిల్లల రక్షణ వంటి వివిధ రకాల అంశాలపై ప్రజల్ని చైతన్య పరచడానికి ఖమ్మం జిల్లా టీఎల్ పేట గ్రామంలో పోలీసులు కళా జాతర నిర్వహించారు.
మూఢనమ్మకాలపై పోలీసు కళాజాతర
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం టీఎల్పేటలో నిర్వహించిన పోలీస్ కళాజాతర ఆకట్టుకుంది. గ్రామంలో ప్రజలను వివిధ అంశాలపై చైతన్య పరుస్తూ పోలీస్ కళాకారులు నిర్వహించిన ప్రదర్శనలు ఆసక్తికరంగా నిలిచాయి. మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ఆడపిల్లల రక్షణ వంటి అంశాలపై నాటికలు, గీతాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. జబర్దస్త్ కళాకారుడు కర్తానందం ప్రదర్శించిన హాస్య నాటికలు అలరించాయి.
- ఇదీ చూడండి : తమిళనాట ఉగ్ర కలకలం... సర్వత్రా హైఅలర్ట్