తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ​ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖ.. వాటిపై నివేదిక ఇవ్వాలని సూచన - తెలంగాణ తాజా వార్తలు

Polavaram Project Authority letter to AP Govt: కిన్నెరసాని, ముర్రేడువాగు నదుల వెంట ముంపునకు గురయ్యే ప్రాంతాలను వీలైనంత త్వరగా గుర్తించి నివేదిక ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ).. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌కు పీపీఏ డిప్యూటీ డైరెక్టర్‌ లేఖ రాశారు.

Polavaram Project
Polavaram Project

By

Published : Jan 7, 2023, 10:51 AM IST

Polavaram Project Authority letter to AP Govt : కిన్నెరసాని, ముర్రేడువాగు నదుల వెంట ముంపునకు గురయ్యే ప్రాంతాలను వీలైనంత త్వరగా గుర్తించి నివేదిక ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ).. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌కు పీపీఏ డిప్యూటీ డైరెక్టర్‌ లేఖ రాశారు.

తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించి ఆయా ప్రాంతాలను గుర్తించాలని గతంలోనే సూచించినట్లు లేఖలో పేర్కొన్నారు. అందుకు సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ తెలిపింది. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని పోలవరం చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించడంతోపాటు తక్షణమే నివేదిక పంపాలని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details