Pilli Akhil Sailor in World Sailing Championship :అత్యంత సాహోసోపేతమైన క్రీడల్లో సెయిలింగ్ ఒకటి. విసురుగా వచ్చే భారీ సముద్రపు అలల్నీ ఈ క్రీడలో దాటుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. పైగా ఇతరులతో పోటీ పడుతూ ఒడుపుగా లక్ష్యాన్ని చేరాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ఎన్నో సమస్యలన్నింటినీ దాటుకుని విజయాలు సాధిస్తూ.. సెయిలింగ్ టాప్ ర్యాంకర్ కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు ఈ యువ క్రీడాకారుడు.
పిల్లి అఖిల్ స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని వైరా మండలం కోస్టాల గ్రామం. తల్లిదండ్రులు పిల్లి శరత్ బాబు, ప్రమీల వ్యవసాయదారులు. చిన్నప్పుడే ఇతడిలోని ప్రతిభను గుర్తించి ఈత నేర్పించాడు చిన్నాన్న రాజు. ఎలాగైనా అఖిల్ కూడా ఆటల్లో ఎదగాలని ప్రోత్సాహించాడు. ఈ క్రమంలోనే హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్‌ల్లో చేరాడు ఈ కుర్రాడు. అక్కడ ఇతడిలోని ప్రతిభను చూసి సెయిలింగ్ క్రీడ నేర్పేందుకు శిక్షకులు ఎంపిక చేశారు.
Pilli Akhil Youngsailor in India :శిక్షణ సమయంలో అఖిల్() చూపుతున్న నేర్పు, ప్రతిభ పాటావాలను గుర్తించి బెంగళూరులోని కేంద్రీయ విద్యాలయంలో ప్రత్యేక శిక్షణ పొందడానికి ఎంపిక చేశారు.అక్కడే పడవ పోటీల్లోప్రత్యేక శిక్షణకు అర్హత సాధించాడు. ఇలా ఐదేళ్ల పాటు సెయిలింగ్‌లో రాటుదేలి.. ఇక వెనుదిరిగి చూడలేదు ఈ యువ క్రీడాకారుడు.
అత్యంత క్లిష్టమైన ఈ ఆటలో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నాడు అఖిల్ . తోటి క్రీడాకారిణి అలేఖ్య ఖండూతో కలిసి పతకాల పంట పండిస్తూ.. నెంబర్ వన్ జోడీగా దూసుకెళ్తున్నారు. నాలుగేళ్ల క్రితం అండర్ 19 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన జోడీ వీరిదే. జాతీయ స్థాయి సింగిల్, డబుల్ల్స్ మిక్స్డ్, డబుల్ పోటీల్లో 13 పతకాలు గెలిచాడు అఖిల్. మణిపూర్, షిల్లాంగ్ జాతీయ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు.
ఈ ఏడాది యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ సెయిలింగ్ పోటీలలో అఖిల్, అలేఖ్య మిక్స్‌డ్ డబుల్‌లో అత్యుత్తుమ ప్రదర్శన చూపారు. వీరికి వచ్చిన ర్యాంకు ఆధారంగా వైఏఐ వీరిని అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక చేసింది. అండర్ 19లో నాలుగు సంవత్సరాల తర్వాత వరల్డ్ ఛాంపియన్‌షిక్‌కి ఎంపికైన జోడీ వీరిదే కావడం విశేషం.