ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో ఉన్న మూడు ప్రధాన బ్యాంకుల వద్ద జనాలు లాక్‌డౌన్ నిబంధనలు మరిచి గుంపులు గుంపులుగా వరసలో నిల్చున్నారు. నగదు డ్రా చేసుకోవాలన్న తొందరపాటులో ప్రజలు బ్యాంకుల ముందు భౌతిక దూరం మరిచిపోతున్నారు.
గుంపులు వద్దు.. భౌతిక దూరం ముద్దు
ఖమ్మలో జిల్లా తల్లాడ మండల కేంద్రంలో బ్యాంకులు, పోస్టాఫీసులు, నగదు సేవా కేంద్రాల వద్ద జనం గుమిగూడి భౌతిక దూరం మరుస్తున్నారు. ఓ వైపు అధికారులు సూచనలు ఇస్తున్నా... పెడచెవిన పెడుతున్నారు.
గుంపులు వద్దు.. భౌతిక దూరం ముద్దు
కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నా జనాలు పట్టించుకోవడం లేదు. మరికొన్ని చోట్ల బ్యాంకుల వద్ద కనీస వసతులు లేక తప్పనిసరి పరిస్థితుల్లో నీడ ఉన్న చోటుకు చేరుతున్నారు.
ఇదీ చూడండి:కరోనా వేళ... ఊరెళ్లేటోళ్లకు ఊరట!