రాష్ట్రంలో పలు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచే ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మంలో ఉదయం గంటపాటు కురుసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని మయూరి కూడలి, ప్రకాశ్ నగర్ , మూడో పట్టణ ప్రాంతంలోని రోడ్లపై పెద్దఎత్తున నీరుచేరింది.
Thunder: ఖమ్మంలో వర్షం.. పిడుగు పడి తాడిచెట్టు దగ్ధం - తెలంగాణ వార్తలు
రుతుపవనాల ఆగమానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. నిన్నటి నుంచి వాతావరణం చల్లబడగా... వేకువజాము నుంచి వర్షం ప్రారంభమైంది. ఖమ్మంలోని ఎరుపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని తాటిచెట్టుపై పిడుగు పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Thunder: ఖమ్మంలో వర్షం.. పిడుగు పడి తాడిచెట్టు దగ్ధం
మధిర నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులు వీచాయి. నియోజకవర్గంలోని ఎరుపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న తాటి చెట్టుపై పిడుగు పడి... చెట్టు పూర్తిగా కాలిపోయింది. పిడుగు శబ్దానికి స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. సమీపంలోని ఇళ్లల్లో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు.
ఇదీ చూడండి:WEATHER REPORT: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు