తెలంగాణ

telangana

ETV Bharat / state

స్నేహితులతో ఈతకెళ్లి డిగ్రీ విద్యార్థి మృత్యువాత - స్నేహితులతో ఈతకెళ్లి డిగ్రీ విద్యార్థి మృత్యువాత

స్నేహితుడి ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. సరదాగా అందరూ కలిసి ఈతకు వెళ్లారు. దురదృష్టవశాత్తు ఓ విద్యార్థి నీటిలో మునిగి చనిపోయాడు.

స్నేహితులతో ఈతకెళ్లి డిగ్రీ విద్యార్థి మృత్యువాత

By

Published : May 13, 2019, 4:04 PM IST

స్నేహితులతో ఈతకెళ్లి డిగ్రీ విద్యార్థి మృత్యువాత

స్నేహితుడింటికి శుభకార్యానికి వెళ్లిన డిగ్రీ విద్యార్థి బావిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్లలో విషాదాన్ని నింపింది. కల్లూరు మండలం బంజరకు చెందిన రాచబంటి నరేష్ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చుదువుతున్నాడు. ఆదివారం కొనిజర్లలోని తన స్నేహితుడు నాగరాజు ఇంట్లో శుభకార్యానికి వెళ్లాడు. భోజనాలు చేసిన తర్వాత మిగతా స్నేహితులతో కలిసి సమీపంలోని ఎన్ఎస్పీ కాలువ వద్ద బావిలో ఈతకు వెళ్లారు. లోతు తెలియని నరేష్ బావిలో మునిగి గల్లంతయ్యాడు. రోజంతా వెతికినా లాభం లేకపోయింది. మరుసటి రోజు నరేష్ మృతదేహం నీటిపై తేలింది. పెద్ద చదువులు చదివి తమకు అండగా ఉంటాడని కళలు కన్న తల్లిదండ్రలకు కుమారుడి మరణం శోకాన్ని మిగిల్చింది.

ABOUT THE AUTHOR

...view details