తెలంగాణ

telangana

ETV Bharat / state

'తాతే నా ఆదర్శం... 35 ఏళ్లుగా సైకిలే నా వాహనం' - సైకిల్ శ్రీదేవీ

దాదాపు ఆరు పదుల వయసు ఆమెది. కానీ సైకిల్​పై తూనీగలా రయ్​మంటూ దూసుకెళ్తుంది. ఈ అలవాటు ఇప్పుడు చేసుకున్నది కాదు.. 35 ఏళ్లుగా సైకిల్​పైనే నా సవారీ అంటూ గొప్పగా చెపుతోంది. తాత నుంచి స్ఫూర్తి పొంది ఈ అలవాటు చేసుకున్నానని పేర్కొంది. రోజుకు ఐదారు కిలో మీటర్లు సైకిల్​ తొక్కుతూ.. ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న అని చెబుతోన్న ఈ బామ్మ కథను ఒకసారి చూసేద్దాం..

old lady using cycle from 35 years in khammam
'తాతే నా ఆదర్శం... 35 ఏళ్లుగా సైకిలే నా వాహనం'

By

Published : Mar 17, 2021, 1:27 PM IST

సైకిల్ తొక్కుకుంటూ వడివేగంగా వెళ్తున్న ఈమె పేరు మద్దాలి శ్రీదేవి. వయసు 58 ఏళ్లు. ఖమ్మం జిల్లాలోని నాయుడుపేటలో నివాసముంటుంది. తన తాత మాజీ ఎమ్మెల్యే మంచికంటి రాంకిషన్ రావును ఆదర్శంగా తీసుకుని 35 ఏళ్లుగా సైకిల్ తొక్కుతున్నట్లు శ్రీదేవి వెల్లడించారు. రాంకిషన్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలను కలిసేందుకు సైకిల్​పై వెళ్లేవారని... ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా హుషారుగా ఉండేవారని తెలిపింది.

'తాతే నా ఆదర్శం... 35 ఏళ్లుగా సైకిలే నా వాహనం'

తాతను చూస్తూ పెరిగిన ఆమె 1985లో సైకిల్​ కొనుకున్నట్లు వెల్లడించారు. అప్పటి నుంచి సైకిల్​పైనే తన ప్రయాణం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకూ ఎక్కడ పనిచేసినా... ఏదైనా అవసరమున్న సైకిల్​పైనే వెళ్తానని శ్రీదేవి వెల్లడించింది. ఇలా రోజుకు ఐదారు కిలోమీటర్లు తిరుగుతున్నానని... దీనివల్లే ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతున్నారు శ్రీదేవి.

ఇదీ చూడండి:రయ్‌రయ్‌మంటూ బండితో రోడ్లపై దూసుకెళ్తున్న మైనర్లు

ABOUT THE AUTHOR

...view details