తెలంగాణ

telangana

ETV Bharat / state

శివరాత్రినాడు ఈ ఆలయంలో వింత ఆచారం - ఖమ్మంలో శివరాత్రి వేడుకలు

దేవునికి నైవేద్యం అనగానే గుర్చొచ్చేవి పలు రకాల పండ్లు, పిండి వంటలు. కానీ ఓ ఆలయంలో శివరాత్రి రోజున మద్యం, మాంసాలతో విందు ఆరగిస్తారు. ఈ వింత ఆచారం గురించి తెలుసుకోవాలంటే ఖమ్మం జిల్లా తీర్థాలలో కొలువై ఉన్న సంగమేశ్వరుడి సన్నిధికి వెళ్లాల్సిందే.

non veg served in the lord shiva temple
శివరాత్రినాడు ఈ ఆలయంలో వింత ఆచారం

By

Published : Feb 22, 2020, 8:25 AM IST

Updated : Feb 22, 2020, 9:04 AM IST

శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు శివరాత్రి. ఈ పర్వదినాన శివునికి వివిధ రూపాల్లో భక్తులు పూజలందిస్తారు. శివరాత్రి రోజున నిత్య పూజలు, ఉపవాసాల దీక్షలు, నైవేద్యాలు కనిపిస్తాయి. కానీ.. దాదాపు 600 ఏళ్ల చరిత్ర ఉన్న ఓ పురాతన శివాలయంలో వింత ఆచారం కొనసాగుతోంది. శివరాత్రి రోజున మద్యం, మాంసం ముట్టొద్దన్న ఆచారం అక్కడ ఏమాత్రం చెల్లదు.

ఓ వైపు శివదర్శనాలు సాగుతుంటే.. మరోవైపు... పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశాల్లో జోరుగా మద్యం, మాంసాహారంతో భక్తులు పండుగ చేసుకుంటారు. చనిపోయిన వారికి పిండప్రదానం చేస్తుంటారు. తలనీలాలు సమర్పిస్తారు. ఇంత వింత ఆచారానికి కేంద్రమైన ఆ ప్రదేశం ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఖమ్మం జిల్లాలోని తీర్థాలలో కొలువైన సంగమేశ్వరుడి సన్నిధికి వెళ్లాల్సిందే.

శివరాత్రినాడు ఈ ఆలయంలో వింత ఆచారం

ఇదీ చూడండి:గ్రామ రూపురేఖలు మార్చేసిన "పల్లెప్రగతి"

Last Updated : Feb 22, 2020, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details