ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఏన్కూరులో తెరాస ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీసి అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు వెళ్లారు. ఏన్కూరు మండలంలోని జడ్పీటీసీతోపాటు 10 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు. తల్లాడ, జూలూరుపాడు మండలాల్లో కూడా నామినేషన్లు దాఖలయ్యాయి.
ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన రెండో విడత నామినేషన్లు - నామపత్రాల దాఖలు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రెండో విడతలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు.
నామపత్రాల దాఖలు
ఇవీ చూడండి: భవిష్యత్తు అంకుర సంస్థలదే: జయేష్ రంజన్