ప్లాస్టిక్ నిషేధంపై ప్రతి ఒక్కరూ సైనికుడిలాగా పోరాడాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ సూచించారు. నగరంలోని ఎస్.బి.ఐ.టీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనాడు -ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ప్రతి ఒక్క పౌరుడు ప్లాస్టిక్ సంచులు వాడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. దుకాణాలకు వెళ్లినప్పుడు విధిగా జూట్ సంచులు, వస్త్రంతో చేసిన సంచులు వెంట తీసుకువెళ్లాలని సూచించారు. అక్టోబరు 1 నుంచి ఖమ్మంలో విడతల వారిగా ప్లాస్టిక్ పై నిషేధం అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ట్రైనీ కలెక్టర్ ఆదర్శ్ సురభి, నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్, కళాశాల కరస్పాండెంట్ ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ నిషేధంపై ప్రతి ఒక్కరూ సైనికుడిలా పోరాడాలి - ప్లాస్టిక్ నిషేధంపై ప్రతి ఒక్కరూ సైనికుడిలా పోరాడాలి
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనాడు -ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్లాస్టిక్ నిషేధంపై ప్రతి ఒక్కరూ సైనికుడిలా పోరాడాలి
TAGGED:
ప్లాస్టిక్ నిషేధం