జిల్లా పంచాయతీ అధికారిగా నియమితులైన అడ్డాల శ్రీకాంత్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లాలో డీఎల్పీవోగా పనిచేస్తున్న శ్రీకాంత్ ఉద్యోగోన్నతిపై ఖమ్మం డీపీవోగా నియమితులయ్యారు. జిల్లాకు వచ్చిన శ్రీకాంత్ ముందుగా కలెక్టర్ కర్ణన్, సహాయ కలెక్టర్ స్నేహలతను మర్యాదపూర్వకంగా కలిశారు. వారి అనుమతితో డీపీవోగా బాధ్యతలు చేపట్టారు.
ఖమ్మం డీపీవోగా శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
జిల్లా పంచాయతీ అధికారిగా అడ్డాల శ్రీకాంత్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మూడున్నరేళ్లుగా డీపీవోగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు.
డీపీవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్
విధుల్లో చేరిన శ్రీకాంత్‌ను కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. బదిలీపై వెళుతున్న శ్రీనివాసరెడ్డికి వీడ్కోలు పలికారు.
ఇవీ చూడండి:తెలంగాణకు 37.67, ఏపీకి 17 టీఎంసీలు