తెలంగాణ

telangana

ETV Bharat / state

అత్యధిక మెజార్టీతో గెలిచేది నేనే: నామ - khammam

పార్లమెంట్‌ ఎన్నికల్లో తెరాసకు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఖమ్మం నుంచి వస్తుందని  ఎంపీ  అభ్యర్థి నామ నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముగిసిన సందర్భంగా వైరా నియోజకవర్గ కేంద్రంలో నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

గెలుపులో మొదట ఉండేది ఖమ్మమే

By

Published : Apr 13, 2019, 5:29 PM IST

Updated : Apr 13, 2019, 11:46 PM IST

ఐదేళ్ల తెరాస పాలన దేశానికే ఆదర్శమని ఖమ్మం తెరాస లోక్​సభ అభ్యర్థి నామ నాగేశ్వర రావు అన్నారు. రాష్ట్రంలో తెరాస 16స్థానాల్లో గెలుస్తుందని సర్వేలే చెబుతున్నాయన్నారు. ఖమ్మంలో తెరాస విజయం కష్టమనుకున్న చోటు నుంచే మొదటి గెలుపు ప్రకటన వస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో సహకరించిన వారందరికీ వైరాలో కృతజ్ఞతలు చెప్పారు. నామతో పాటు ఎమ్మెల్యే రాములునాయక్‌, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

గెలుపులో మొదట ఉండేది ఖమ్మమే
Last Updated : Apr 13, 2019, 11:46 PM IST

ABOUT THE AUTHOR

...view details