తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ మాటే శిరోధార్యం: పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి - parliament

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 14 ఏళ్లు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసిన కేసీఆర్​ అడుగుజాడల్లోనే నడుస్తానని పొంగులేటి తెలిపారు. నామ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తెరాస ఎన్నికల ప్రచారం

By

Published : Mar 31, 2019, 6:53 PM IST

తెరాస ఎన్నికల ప్రచారం
రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు సముచిత స్థానం కల్పిస్తారని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా సీఎం ఆశయాల సాధనకోసం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావును గెలిపించాలని పేర్కొన్నారు. నామతో కలిసి వైరా నియోజకవర్గం కారేపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎవరెన్ని మాటలు చెప్పినా కేసీఆర్‌ మాటే శిరోధార్యంగా ముందుకు సాగుతానని నామ గెలుపునకు కృషిచేస్తానని తెలిపారు.

14ఏళ్ల ఉద్యమస్ఫూర్తి గల నాయకుడిగా కేసీఆర్‌ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారని, ఆయన అడుగు జాడల్లోనే నడుస్తానని అన్నారు. ప్రచారంలో వివిధ గ్రామాల నుంచి తెరాస శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాములు నాయక్‌, నాయకులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details