ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా నామ నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రేణుకా చౌదరి పోటీ చేశారు. భాజపా నుంచి వాసుదేవరావు పోటీలో ఉన్నారు. గులాబీ పార్టీ నేతలు, హస్తం పార్టీ శ్రేణలు గెలుపు తమదేనని ధీమాగా ఉండగా.. సీపీఎం, భాజపా ఈ సారి ఆశించిన దానికంటే ఎక్కువ ఓట్లు వస్తాయని అంచనాలు వేస్తున్నాయి. అందరి ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
ఖమ్మంలో గెలుపుపై ఎవరికి వారే ధీమా.. - mp election in khammam
అనూహ్య ఫలితాలిచ్చే ఖమ్మం పార్లమెంట్ ఓటర్లు ఈ సారి ఎవరికి పట్టం కట్టారన్న అంశం సర్వాత్రా ఆసక్తి రేపుతోంది. ఓటరు నాడి అంతుబట్టక రాజకీయ పార్టీలు ఫలితాలపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. అధికార పార్టీ తరఫున అనూహ్యంగా టికెట్ దక్కించుకుని బరిలో నిలిచిన నామ నాగేశ్వరరావు... గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్నారు. ఫిరాయింపులు, ప్రభుత్వ వ్యతిరేకతే తనను గెలిపిస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
kmm