భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో లాక్డౌన్కు సహకరించాలని పోలీసులు చెబుతున్నారు. పదేపదే చెబుతున్నప్పటికీ ఇల్లెందు పట్టణంలో కొంతమంది వాహనదారులు అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు.
లాక్డౌన్ పాటించని వాహనదారులు
లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరిని బయటకు రావొద్దని సూచించారు. అయినప్పటికి ఇల్లెందు పట్టణంలో వాహనదారులు విచ్చలవిడిగా బయటకు వస్తూ నిబంధనలను పాటించడం లేదు. గతంలో తిరిగిన మాదిరిగానే ప్రయాణిస్తున్నారు.
లాక్డౌన్ పాటించని వాహనదారులు
అధికారులు, పోలీసుల సూచనలు పట్టించుకోకుండా వస్తున్న వాహనాలపై పోలీసులు జరిమానాలు విధిస్తున్నప్పటికి ఇవాళ అధిక సంఖ్యలో వాహనాదారులు బయటకు వచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపై ప్రయాణిస్తున్నారు.
ఇదీ చూడండి :లాక్డౌన్ సమయంలో స్మృతి ఏం చేస్తుందో తెలుసా!