తెలంగాణ

telangana

ETV Bharat / state

నగదు మాయమైందంటూ మహిళల ఆందోళన - తపాలాకార్యాలయం ఖాతాల్లో నగదు మాయం

తపాలా కార్యాలయంలో డబ్బు దాచుకుంటే భరోసా ఉంటుందని బావించి మహిళలు ఖాతాలు తెరిచారు. ప్రతి నెలా కొంత దాచుకుంటూ వచ్చారు. అవసరానికి నగదు తీసుకుందామనేసరికి ఖాతాలో డబ్బుల్లేక లబోదిబోమంటున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా గోపవరంలో జరిగింది.

మహిళల ఆందోళన

By

Published : May 31, 2019, 11:43 AM IST

ఖమ్మం జిల్లా గోపవరంలో తపాలా కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళన చేశారు. తాము పోస్టాఫీసుల్లో పొదుపు చేసిన నగదు రికార్డుల్లో లేకపోవడంపై నిరసనకు దిగారు. వివిధ పథకాల కింద దాచుకున్న డబ్బులు తీసుకుందామని వెళ్లిన మహిళా ఖాతాదారులకు నిరాశే ఎదురైంది. తాము దాచుకున్న సొమ్ము వివరాలు అడిగితే తపాలా అధికారిణి సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా ఇదే నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వాపోయారు. ఈ విషయంపై విచారణ జరపాలని మహిళలు కోరుతున్నారు. నగదు మాయం కావడంపై పోలీసులకు సమాచారమందించారు.

పోస్టాఫీసు ఖాతాల్లో నగదు మాయం

ABOUT THE AUTHOR

...view details