తెలంగాణ

telangana

ETV Bharat / state

కళాశాల భూముల పరిరక్షణకు ఉద్యమిస్తాం: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి - ఖమ్మం జిల్లా వార్తలు

ఖమ్మంలోని ఎస్​ఆర్​బీజీఎన్​ఆర్​ డిగ్రీ కళాశాల భూముల పరిరక్షణకు ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి స్పష్టం చేశారు. అర్బన్​ పార్క్​ పేరుతో భూములను కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. కళాశాల స్తంభాద్రి వృక్ష స్థలిని ఆయన పరిశీలించారు.

mlc narsireddy visit government degree college in  khammam district
'కళాశాల భూముల పరిరక్షణకు ఉద్యమానికైనా సిద్ధం'

By

Published : Jun 27, 2020, 5:27 PM IST

ఖమ్మం జిల్లాలో పురాతన కళాశాల ఎస్​ఆర్​బీజీఎన్​ఆర్ డిగ్రీ కళాశాల భూములను అర్బన్ పార్క్ పేరుతో కాజేసేందుకు కుట్రపన్నుతున్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆరోపించారు. ఖమ్మంలోని స్తంభాద్రి వృక్ష స్థలిని ఆయన పరిశీలించారు. పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కళాశాల మైదానానికి ఆనుకొని ఉన్న బొటానికల్ గార్డెన్​లో ప్రభుత్వ అధికారులు అర్బన్ పార్క్ నిర్మించేందుకు చూస్తున్నారని తెలిపారు.

ఎంతో విలువైన ప్రభుత్వ కళాశాల స్థలాన్ని కళాశాలకే ఉంచాలని.. త్వరలో డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కళాశాల భూముల పరిరక్షణకు ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details